రాయగిరిలో దసరా వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ బొడ్రాయి నుంచి రామాలయం వరకు డప్పు చప్పులతో ఊరేగింపుగా మున్సిపల్ ఛైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ ఛైర్మన్ చింతల కిష్టయ్య, కౌన్సిలర్ అరుణ పూర్ణచందర్, గ్రామ పెద్దలు వెళ్లి జమ్మి వృక్షానికి పూజలు నిర్వహించి ఆలయంలో పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఒకరికొకరు జిమ్మీ పంచుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.