ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతా: చిరుమర్తి లింగయ్య
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తాజాగా మీడియాతో అన్నారు. 'పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాను. రాజకీయ కుట్రతోనే నాకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికిస్తున్నారు. నల్గొండలో పనిచేసిన పోలీసులతో మాట్లాడి ఉండొచ్చు. అధికారుల పోస్టింగులు, కార్యకర్తల అవసరాల కోసం నేను మాట్లాడటం సహజమే' అని అన్నారు.