భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామం శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం, సహస్రనామార్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.