
భార్యతో బలవంతపు శృంగారం నేరం కాదు: ఢిల్లీ హైకోర్టు
భార్యతో భర్త బలవంతపు శృంగారంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బలవంతపు శృంగారం చట్టరీత్యా నేరం కాదని పేర్కొంది. భర్త తనకు ఇష్టం లేకపోయినా అసహజ శృంగారానికి పాల్పడ్డాడని ఓ మహిళ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహ బంధంలో శృంగారానికి అంగీకారం ఇచ్చినట్టేనని.. అసహజ శృంగారాన్ని రేప్గా పరిగణించినా, అది వివాహితుల మధ్య జరిగితే IPC సెక్షన్ 375 వర్తించదని స్పష్టం చేసింది.