తుర్కపల్లిలో పంద్రాగస్టు వేడుకలు
లంబాడి హక్కుల పోరాట సమితి మరియు గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తుర్కపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు భూక్యా సంతోష్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ..74 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, బహుజనులు ఆర్థికంగా,సామాజికంగా, విద్య పరంగా,బహుజనుల అభివృద్ధి చెందినప్పుడే పూర్తి స్వాతంత్య్రం పొందినట్టని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భూక్యా సంతోష్ నాయక్ ,జివిఎస్ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ధరావత్ ప్రవీణ్ నాయక్ మరియు తుర్కపల్లి సర్పంచ్ పడాల శ్రీనివాస్ వనితా, తుర్కపల్లి మాజీ ఎంపీటీసీ తలారి శ్రీనివాస్ జివిఎస్ ఉపాధ్యక్షులు భూక్యా శేఖర్ నాయక్, యూత్ వింగ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ నాయక్, కార్యదర్శి శ్రీకాంత్ నాయక్, యూత్ వింగ్ ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు ధారావత్ నరేందర్ నాయక్, జిల్లా నాయకులు సురేష్ నాయక్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.