ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నాయకుల ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నేడు వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నాయకులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కూటమి ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని విజయవాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బారికేడ్లను, పోలీసులను సైతం నెట్టుకుంటూ వైసీపీ నేతలు కలెక్టర్ కార్యాలయం లోపలకి వెళ్లారు.