క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు..యువ బౌలర్ మృతి

83చూసినవారు
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు..యువ బౌలర్ మృతి
జ‌మ్మూ క‌శ్మీర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్ర‌వారం హంజీవ‌ర ప్రాంతంలోని బారాముల్లాలో ఉన్న‌ ప‌ట్టాన్‌లో సుహైబ్ అనే 20 ఏళ్ల యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఈ మేరకు బంతి విసురుతుండ‌గా ఛాతీలో నొప్పి వచ్చి మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంట‌నే తోటి ఆట‌గాళ్లు యాసిన్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే అత‌డు చ‌నిపోయాడ‌ని వైద్యులు తెలిపారు. దీంతో ప‌ట్టాన్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్