వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది ఢిల్లీ మెట్రో. ఢిల్లీ మెట్రోలో నిత్యం ఏదొక ఘటన వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ మెట్రో స్టేషన్‌లో ముగ్గురు యువకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకుని తీవ్రంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.