Top 10 viral news 🔥
ఏపీ నుంచి మొదటిసారి ఐపీఎల్లో ఐదుగురికి అవకాశం
ఐపీఎల్లో ఈసారి ఏపీ నుంచి ఐదుగురికి అవకాశం లభించింది. గుంటూరుకు చెందిన షేక్ రషీద్(20)ను మరోసారి చెన్నై రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. విశాఖకు చెందిన పైల అవినాష్(24)ను రూ.30 లక్షలకు పంజాబ్, కాకినాడ ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజును ముంబై రూ.30 లక్షలకు, శ్రీకాకుళం కుర్రాడు త్రిపురణ విజయ్ను ఢిల్లీ రూ.30 లక్షలకు తీసుకుంది. ఇక విశాఖకు చెందిన నితీశ్ కుమార్ రెడ్డిని SRH రూ.6 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.