10 నుంచి 12 వరకు గోకులాల ప్రారంభోత్సవాలు
AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన గోకులాలను సంక్రాంతి ఉత్సవాల పేరుతో ఈ నెల 10 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. 10న కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు గోకులాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు.