AP: వైసీపీలో పరిస్థితి దారుణంగా మారింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 6 నెలల్లోనే పరిస్థితి తారుమారైంది. ఐదేళ్లు అధికారంలో ఉండి తిరుగులేని శక్తిగా ఎదిగిన పార్టీ, ఇప్పుడు నియోజకవర్గాలను నడిపించే నాయకుడే లేడు. ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్, యలమంచలి, పాయకరావుపేట, అనకాపల్లిలో పార్టీకి ఇన్‌ఛార్జ్‌లు లేరు. గతంలో ఈ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన నేతల్లో కొందరు పార్టీని వీడారు. ఈ నియోజకవర్గాలపై జగన్ దృష్టి పెట్టడం లేదని కార్యకర్తలు అంటున్నారు.