
BBCకి రూ.3.4కోట్ల ఫైన్ విధించిన ED
BBC ఇండియాకు ED భారీ షాక్ ఇచ్చింది. రూ. 3.4 కోట్లకు పైగా ఫైన్ విధించింది. 2023లో FDI, FEMA నిబంధనలను ఉల్లంఘించిందని ED పేర్కొంది. దీంతో ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇటీవల జరిపిన విచారణలో సంస్థతో పాటు ముగ్గురు డైరెక్టర్లకు రూ. 1.14 కోట్ల చొప్పున ఫైన్ విధించినట్లు ED వెల్లడించింది. దేశంలోని డిజిటల్ మీడియా రంగంలో FDI పరిమితి 26 శాతం మించకూడదన్న నిబంధనను BBC ఉల్లంఘించినట్లు ED తెలిపింది.