మీ కన్నా జగనే మేలు: జేసీ ప్రభాకర్ రెడ్డి (వీడియో)
AP: తాడిపత్రిలో జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీకన్నా జగన్ రెడ్డినే మేలు కదరా. బీజేపీ వాళ్ల లాగా జగన్ ఎప్పుడూ నా బస్సులు తగలబెట్టలేదు. జగన్ రెడ్డి కేవలం నా బస్సులను ఆపాడు అంతే. 300 బస్సులు పోతేనే నేను ఏడవలేదు... ఇప్పుడు ఎందుకు బాధ పడతాను? నా బస్సులను కాలుస్తారా? ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ఆయన అన్నారు.