సింగనమల: మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి

78చూసినవారు
సింగనమల: మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి
బుక్కరాయసముద్రం మండలంలో మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సీఐ నాగ సునీత సూచించారు. శనివారం బీకేఎస్ మండల కేంద్రంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. శింగనమల, గార్లదిన్నె బీకేఎస్, నార్పల మండలాలకు సంబంధించిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 మద్యం దుకాణాలకు ఈ నెల 9 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు రుసుం రూ. 2 లక్షలు చెల్లించాలన్నారు. లాటరీ పద్ధతి ద్వారా మద్యం షాపులు కేటాయిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్