
స్కూళ్లకు ఒకే యాప్.. విద్యాశాఖ కసరత్తు
AP: విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ యాప్లో స్కూల్, టీచర్, స్టూడెంట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో తల్లిదండ్రులు విద్యార్థుల పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే స్కూళ్ల సౌకర్యాల సమాచారమూ ఉంటుంది. టీచర్ల రోజువారీ కార్యకలాపాలు, సెలవులు, హాజరు, బదిలీల వివరాలు పొందుపరుస్తారు. త్వరలోనే విద్యాశాఖ ఈ యాప్ను అందుబాటులోకి తేనుంది.