శింగనమల: దెబ్బతిన్న వంతెన మరమ్మతులు చేపట్టండి
శింగనమల మండలంలోని గుమ్మేపల్లి, కల్లుమడి రహదారి మీద దెబ్బతిన్న వంతెన మరమ్మతులు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాల రంగయ్య ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ రహదారి మధ్యలో గోతులు పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దారి మీద ప్రయాణిస్తున్నారు కానీ మరమ్మతులకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.