బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని గుడ్డం నాగేపల్లి నుండి సబ్ స్టేషన్ వరకు రూ కోటి 20 లక్షలతో బి. టి రోడ్డు నిర్మాణానికి శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్బంగా మంత్రి బి. టి రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.