మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో ట్యాంకర్లతో నీటి సరఫరా
ఉరవకొండ పట్టణంలో తాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ చర్యలు చేపట్టారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో ట్యాంకర్లతో నీటి సరఫరా ప్రారంభించారు. పట్టణంలో నెలకోసారి కూడా కుళాయిలకు తాగునీరు రాని విషయాన్ని స్థానికులు ఎన్నికల ముందు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వారి సమస్యను క్షేత్ర స్థాయిలో గుర్తించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.