అన్న క్యాంటీన్లకు విరాళం ఇస్తే ఐటీ మినహాయింపు
వచ్చే నెలలో అన్న క్యాంటీన్ పేరుతో ఏపీ ప్రభుత్వం ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేయనుంది. ఇందుకు ఐటీ శాఖ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాలు అనుమతి ఇచ్చాయి. విరాళాలు ఇచ్చే వారికి ఐటీ మినహాయింపు లభించనుంది. కార్పొరేట్ కంపెనీలు, సామాన్యుల నుంచి విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. వంద క్యాంటీన్లలో మూడు పూటలకు కలిపి రూ.26.25 లక్షలు ఇచ్చేవారికి రోజంతా వారి పేరుతోనే ఆహారం అందిస్తారు.