ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత
అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. పాడేరులో దట్టమైన పొగమంచు అలుముకుంది. మినుములూరులో 14, చింతపల్లిలో 17, అరకులో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొండలు, లోయలు, జలపాతాల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో తెల్లవారుజామున సూర్యోదయం చూసేందుకు వంజంగి, మేఘాల కొండ ప్రాంతాలు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.