భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ ఓ ఇంటివాడయ్యాడు. డైరెక్టర్ RGV మేనకోడలు, ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మను అతను శనివారం పెళ్లాడాడు. హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ-క్రీడా ప్రముఖుల నడుమ వీరి పెళ్లి వైభవంగా జరిగింది. శ్రీకాంత్ 2018లో వరల్డ్ నం.1 క్రీడాకారుడిగా నిలిచాడు. శ్రావ్య పలువురు సినీ ప్రముఖులకు వ్యక్తిగత స్టైలిస్ట్‌గా పనిచేశారు.