కాలేజీల అకౌంట్లోకే డబ్బులు జమ!
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల అకౌంట్లోకే జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై బుధవారం కేబినేట్ సమావేశం చర్చించి, ఆమోదించనుంది. ప్రస్తుత విధానం ప్రకారం రీయింబర్స్మెంట్ డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆ డబ్బులతో ఫీజులు కట్టకపోవడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగిపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.