త్వరలోనే కొత్త డిజైన్‌తో రూపొందించిన రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. ‘పింఛన్ల ఆడిటింగ్‌కు అందరూ సిద్ధంగా ఉండాలి. అర్హత ఉన్న వారికి అధికారులు పింఛన్ అందించే ఏర్పాటు చేయాలి. దీపం-2 పథకం అమలులో లక్షల మంది కార్డుదారులకు ఆధార్ అనుసంధానం కాలేదని తేలింది. ఈ-కేవైసీ చేయించుకునే అవకాశాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కల్పిస్తాం. కౌలు రైతుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తాం.’ అని అన్నారు.