16,347 డీఎస్సీ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు!
16,347 డీఎస్సీ ఉద్యోగాల భర్తీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు పరిశీలించి నివేదిక పంపించాలని డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, మహిళలు, ఎక్స్ సర్వీస్, స్పోర్ట్స్, దివ్యాంగుల కోటా అమలు, సమాంతర రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ఈ నెల 28వ తేదీలోపు పంపాలని ఆదేశించింది. కాగా, వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.