ఇన్స్టా పరిచయం.. మైనర్ బాలికను గర్భవతిని చేసి..
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువకుడి మాయ మాటలలో పడి మైనర్ బాలిక మోసపోయింది. ప్రేమ పేరుతో దగ్గరైన ఆ యువకుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో మొహం చాటేశాడు. నెలలు నిండక ముందే బాలికకు కాన్పు కావడంతో బిడ్డ మృతి చెందింది. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు పోక్స్ కేసు నమోదు చేశారు.