తెలంగాణలో 8,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయాన్ని సాధించినందుకు మంగళవారం, బుధవారం సంబరాలు చేసుకోవాలని BRS పిలుపునిచ్చింది. ఈ మేరకు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సంబరాలు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. 10 నెలల్లోనే రూ.18,500 కోట్ల విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేయడంతో, వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని ఈఆర్‌సీని ఒప్పించగలిగామన్నారు.