ఎన్నికల కోడ్ అమలుపై క్షుణ్ణంగా తనిఖీలు చేయండి: ఏఆర్వో
![ఎన్నికల కోడ్ అమలుపై క్షుణ్ణంగా తనిఖీలు చేయండి: ఏఆర్వో](https://media.getlokalapp.com/cache/18/2a/182a28f8eb8704ccf4290d9024a762d0.webp)
చిత్తూరులో ఎన్నికల కోడ్ అమలుపై క్షేత్రస్థాయిలో మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేపట్టాలని ఏఆర్వో, అరుణ అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ఏఆర్వో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఏఆర్వో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎన్నికలకోడ్ అమలుతీరును పక్కాగాతనిఖీచేయాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వ భవనాలు, తపాలాకార్యాలయాలు తదితర ప్రాంతాల్లో ఎలాంటి రాజకీయ పరమైన బ్యానర్లు లేకుండా చూడాలన్నారు.