Apr 09, 2025, 16:04 IST/మంథని
మంథని
పెద్దపల్లి: టీబీ రహిత గ్రామాలను తయారు చేయాలి: కలెక్టర్
Apr 09, 2025, 16:04 IST
పెద్దపల్లి జిల్లాలోని అన్ని గ్రామాలను టీబీ రహిత గ్రామాలుగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ లో స్థానిక సంస్థల పాలనపై పంచాయతీ శాఖ సిబ్బంది, మున్సిపల్ అధికారులతో సమీక్ష జరిపారు. తాగునీటి సరఫరా, సమ్మర్ క్యాంప్ నిర్వహణ, ఉపాధి హామీ పనులు, పారిశుధ్యం, టీబీ నివారణ చర్యలు, నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో చర్చించారు.