ఉరుములతో కూడిన భారీ వర్షం
నాగలాపురం, నారాయణవనం తదితర మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నాలుగు రోజులుగా ప్రజలు ఎండ వేడిమికి అల్లాడిపోయారు. వర్షం కురవడంతో ఉక్క పోతకు ఇబ్బందిపడిన ప్రజలకు ఉపశమనం కలిగింది. వరి పంట సాగుకు పొలాలు దున్నుకున్న రైతులు వర్షం రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులకు ఊరట కలిగింది.