Oct 03, 2024, 02:10 IST/
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
Oct 03, 2024, 02:10 IST
తెలంగాణలో హైదరాబాద్ తో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో గురువారం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలో ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.