అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP: పథకాల అమలుపై లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరును సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉందని అధికారులకు తెలిపారు. లబ్ధిదారుల్లో వంద శాతం సంతృప్తి వచ్చేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో వచ్చిన ప్రజల అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు నేడు అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.