వాట్సాప్ కొత్త లుక్ వచ్చేసింది!
IOS, ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఇంటర్ఫేస్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. యాప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇంటర్ ఫేస్ షేప్, కలర్, ఐకాన్స్, బటన్స్ డిజైన్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. యూజర్ల కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు, టెక్స్ట్ ను సులభంగా చదివేందుకు వీలుగా డార్క్ మోడ్ ను తీసుకొచ్చినట్లు వివరించింది.