3 గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక అప్డేట్
AP: ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కార్యచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గుర్తించింది. వీటిలో తెల్లరేషన్ కార్డుదారుల కనెక్షన్లకు పథకాన్ని వర్తింపజేస్తే ఏడాదికి రూ.3,640 కోట్లు ఖర్చు అవుతుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది.