డబ్బుల కోసం మగాళ్లను పెళ్లాడుతూ ‘నిత్య పెళ్లికూతురు’గా మారుతున్న ఓ లేడీ ఖిలాడీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బండాకి చెందిన పూనమ్ పెళ్లి కూతురుగా, సంజనా గుప్తా ఆమె తల్లిగా నటిస్తూ చాలా మంది మగాళ్లను పెళ్లి పేరుతో మోసం చేస్తూ రాకెట్ నడుపుతున్నట్లు తేలింది. విమలేష్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి వీరికి సహాయం చేస్తుంటారు. ఆరుగురిని మోసం చేయగా.. ఏడో వివాహానికి సిద్ధమవుతున్న తరుణంలో పూనమ్‌ను అరెస్ట్ చేశారు.