
తుని: బెండపూడి దళిత నాయకులు ఆధ్వర్యంలో టీడీపీకి చేరిక
తొండంగి మండలం బెండపూడి గ్రామానికి చెందిన దళితులు సోమవారం టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన వందమందికి పైగా వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. తేటగుంట టీడీపీ కార్యాలయంలో యనమల వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందన్నారు. సాధనాల నూకరాజు, బూసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.