తునిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన వైసీపీ నేతలు
కాకినాడ జిల్లా తుని పట్టణం ఒకటో వార్డు రెల్లి పేటతో పాటు కృష్ణుడు గుడి సమీపాన ఉన్న ముంపు ప్రాంతాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యనమల కృష్ణుడితో పాటు పలువురు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుత స్థితిగతులు అవసరాలను నేరుగా ప్రజలను కృష్ణుడు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలు ప్రజలకు సహాయక చర్యలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.