మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఈనెల 26న అమలాపురంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి వైశ్య సంఘ కళ్యాణమండపంలో , ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు జిల్లా, మండల, గ్రామ, స్థానిక ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.