నాలో నమ్మకం పెరిగింది: చంద్రబాబు
AP: దావోస్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని మాట్లాడారు. ‘మీ అందర్నీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్‌లో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్‌లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. హైదరాబాద్‌లో అన్ని రంగాలను అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఏపీని కూడా అన్నిరంగాల్లో అభివృద్ధి చేద్దాం.’ అని చంద్రబాబు చెప్పారు.