అనపర్తి పాతవూరులోని అంజుమాన్ నూర్ ఇస్లాం మస్జిద్ పాలకవర్గ కమిటీ నూతన అధ్యక్షుడిగా అనపర్తికి చెందిన షేక్ మాబూ సుభాని శుక్రవారం నియమితులయ్యారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా పీర్ బాజ్జీ, రహమాన్, కార్యదర్శిగా ఫకీర్, జనరల్ కార్యదర్శిగా జాఫర్, సంయుక్త కార్యదర్శులుగా నానాజీ, లాల్సాహేబ్ , కోశాధికారిగా నాగుర్ తో పాటు మరో ఏడుగురు కార్యవర్గ సభ్యులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులను సత్కరించారు.