పవన్ ఆత్మ విమర్శ చేసుకో: రోజా
కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని మాజీ మంత్రి రోజా అన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని పవన్ చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం. ఐదేళ్లలో 34 అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. దీనిపై హోంమంత్రి అనిత అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పవన్ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. అధికారం కోసం అబద్ధాలు చెప్తారా?.’ అని రోజా నిలదీశారు.