AP: భవన నిర్మాణ అనుమతులకు త్వరలో కొత్త విధానం తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 15 నాటికి కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత కొత్త విధానంపై నిర్ణయం తీసుకున్నామన్నారు. పంచాయతీలు, మున్సిపాలటీల పన్నులను ప్రజలు చెల్లించాలని కోరారు.