తుప్పు పట్టిన ఒలింపిక్స్ పతకాలు.. కొత్తవి ఇస్తామన్న IOC
పారిస్ ఒలింపిక్స్‌లో ఇచ్చిన పతకాలలో నాణ్యత లేదు. ఈ మేరకు అథ్లెట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా షూటర్ మనూ భాకర్ కూడా తన పతకాలు రంగులు వెలిశాయని, తుప్పు పట్టాయని తెలిపారు. ఈ మెడల్స్‌ను త్వరలోనే రీప్లేస్ చేస్తామని ఐఓసీ ప్రకటించింది. ఫ్రాన్స్ కరెన్సీని ముద్రించే ‘ఫ్రెంచ్ స్టేట్ మింట్’ కొత్త పతకాలను తయారు చేస్తుందని పేర్కొంది. కాగా విజేతల కోసం ‘ఐఫిల్ టవర్’ ఇనుమును మిక్స్ చేసి 5,084 పతకాలు తయారు చేసిన విషయం తెలిసిందే.