హరియాణా BJP రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, సింగర్ రాకీ మిట్టల్ అకా జై భగవాన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ‘2023 జులై 3న కసౌలీకి విహార యాత్రకు వెళ్లాను. ఓ హోటల్‌లో బడోలీ, మిట్టల్ కలిశారు. నటిగా అవకాశం ఇస్తానని మిట్టల్ చెప్పారు. బడోలీ తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభపెట్టారు. అనంతరం బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యం చేశారు. చంపేస్తామని బెదిరించి నా నగ్న చిత్రాలు, వీడియోలు తీసుకున్నారు’ అని ఢిల్లీకి చెందిన యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.