HMPV వైరస్‌పై కేంద్రం కీలక ప్రకటన
దేశంలో HMPV వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదని, 2001లోనే దీనిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.