దేశవ్యాప్తంగా HMPV కేసులు పెరుగుతున్నాయి. చెన్నైలో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటివరకు కర్ణాటకలో 2, గుజరాత్‌లో 1, కోల్‌కతాలో 1, చెన్నైలో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం హెచ్‌ఎంపీవీ కేసులు 6 కి చేరాయి. భారత్‌లో ఒక్కరోజే 6 మంది చిన్నారులకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మరోవైపు అధికారులు మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.