నిర్దోషిగా బయటకొస్తా: జానీ మాస్టర్ (వీడియో)
తనపై వచ్చిన వార్తలపై జాానీ మాస్టర్ స్పందించారు. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకొస్తానని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘అసలు ఏం జరిగిందో నా మనసుకు తెలుసు. ఆ దేవుడికే తెలుసు’ అని అన్నారు. ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుందని చెప్పారు. తాను క్లీన్‌చిట్‌తో బయటకొస్తానని, అప్పుడే మాట్లాడతానని స్పష్టం చేశారు. అప్పటి వరకు తాను నిందితుడిని మాత్రమేనన్నారు.