మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి.. SI అదృశ్యం

56చూసినవారు
మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి.. SI అదృశ్యం
TG: రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్‌ అదృశ్యమయ్యారు. ఎల్లారెడ్డి చెరువు వద్ద వారి వస్తువులు కనిపించడంతో బుధవారం అర్ధరాత్రి వరకు గాలించారు. శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. ఎస్పీ సింధుశర్మ ఎస్ఐ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎస్సై ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అని వస్తుండడంతో ఏం జరిగి ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు.

సంబంధిత పోస్ట్