ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పిఠాపురం గొల్లప్రోలు సభలో పవన్ మాట్లాడుతూ.. ‘రౌడీలు, క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి. అత్యాచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని. హోంమంత్రి అనిత కూడా ఇటీవల జరిగిన ఘటనపై బాధ్యత వహించాలి. నేను ఆ బాధ్యతలు చేపడితే పరిస్థితులు వేరేలా ఉంటాయి. నేతలంతా ఏం చేయకుండా ఉంటే హోంమంత్రిగా నేనే బాధ్యతలు తీసుకుంటా.’ అని అన్నారు.