ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది. దీనికి అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి శాంతి ప్రియా పాండే నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ సహా నలుగురు అధికారులు ఉండనున్నారు.