ఘనంగా విద్యార్థి నాయకుల ఎన్నికలు
పొన్నవరంలోని సీబిఎస్సీ పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెరమని అనగా విద్యార్థి నాయకులను ఎన్నుకునే కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించినట్లు హెచ్ఎం సూర్యవతి తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రమేశ్, డైరెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.